తెలంగాణలో పోలింగ్‌ సమయం పెంచిన ఈసీ

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సమయం పెంచుతున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడిరచింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మే 13 జరిగే పోలింగ్‌ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.రాజకీయ పార్టీల వినతి, వడగాలులు, ఎండ తీవ్రత దృష్ట్యా పోలింగ్‌ సమయం పెంచినట్లు ఈసీ వెల్లడిరచింది. ఓటింగ్‌ శాతం పెంచేందుకు కూడా ఈ నిర్ణయం దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
పోలింగ్‌ ఏర్పాట్లలో ఎన్నికల సంఘం…
తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నామినేషన్ల దరఖాస్తులను పరిశీలించి 525 మంది అభ్యర్థులు లోక్‌?సభ ఎన్నికల్లో పోటీలో ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌?రాజ్‌?తెలిపారు. హైదరాబాద్‌?లోని ఎన్నికల భవన్‌?లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అత్యధికంగా సికింద్రాబాద్‌?లోక్‌?సభ నియోజకవర్గంలో 45 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని తెలిపారు. ఆదిలాబాద్‌?లో అత్యల్పంగా 12 మంది పోటీలో ఉన్నారన్నారు. అలాగే 285 మంది స్వతంత్రులు లోక్‌?సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని వికాస్‌ రాజ్‌ వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా 17 లోక్‌?సభ నియోజకవర్గాల్లో ఏడు స్థానాల్లో మూడు ఈవీఎంలు, 9 స్థానాల్లో రెండు ఈవీఎంలు ఉపయోగించనున్నట్లు ఈసీ వికాస్‌?రాజ్‌?తెలిపారు. ఆదిలాబాద్‌?లోక్‌?సభ స్థానంలో ఒక్క ఈవీఎం మాత్రమే సరిపోతుందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పి అదనంగా కొన్ని ఈవీఎంలు రప్పిస్తున్నామని తెలిపారు. పోస్టల్‌?బ్యాలెట్‌?ను జిల్లాల్లో ప్రింట్‌?చేస్తున్నారని ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌?రాజ్‌?చెప్పారు.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్లా ఓటరు స్లిప్పుల పంపిణీ జరుగుతోందని ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌?రాజ్‌?తెలిపారు. హైదరాబాద్‌?లో 3,986 పోలింగ్‌?బూత్‌?లు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల విధులకు 155 కంపెనీల కేంద్ర బలగాలు వస్తున్నాయన్నారు. 2.94 లక్షల మంది ఎన్నికల సిబ్బందిని వినియోగిస్తున్నామని, పోలింగ్‌?కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని ఈసీ వికాస్‌?రాజ్‌?వివరించారు. మరోవైపు, ఎన్నికల ఫిర్యాదులకు టోల్‌?ఫ్రీ నంబరు 1950 ఏర్పాటు చేశామని వికాస్‌ రాజ్‌ తెలిపారు. టోల్‌?ఫ్రీ నంబరు ద్వారా ఇప్పటివరకు 1,227 ఫిర్యాదులు వచ్చాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 35,809 పోలింగ్‌?స్టేషన్లు ఉన్నాయని, 15 వేల మంది సర్వీసు ఓటర్లు ఉన్నారని తెలిపారు. శుక్రవారం నుంచి హోం ఓటింగ్‌ ప్రారంభం అవుతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *