ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్‌కు బెయిల్‌ అంశాన్ని పరిశీలిస్తాం: సుప్రీంకోర్టు

దేశ రాజధానిలో ఎన్నికల నేపథ్యంలో అరవింద్‌ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌ అంశంపై వాదనలు వింటామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇందుకు సంబంధించిన పిటిషన్‌ను మే 7న విచారిస్తామని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు తెలిపింది. ఈక్రమంలో విచారణకు సిద్ధమై రావాలని ఈడీ తరపు న్యాయవాదికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఈడీ అరెస్టుకు వ్యతిరేకంగా కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణకు సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే ఆయన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ విచారణను పరిశీలిస్తాం అని సుప్రీం ధర్మాసనం వెల్లడిరచింది. దీనిపై స్పందిస్తూ.. మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను తాము వ్యతిరేకిస్తామని ఈడీ తరపున అడిషినల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వి రాజు పేర్కొన్నారు. దాంతో మరింత స్పష్టతనిచ్చిన ధర్మాసనం.. కేవలం పిటిషన్‌ను మాత్రమే విచారిస్తాం. బెయిల్‌ ఇస్తామని చెప్పండం లేదు. చివరకు బెయిల్‌ ఇవ్వొచ్చు..ఇవ్వకపోవచ్చు.. అని తెలిపింది. ఇందుకు సంబంధించి వాదనల కోంస సిద్ధమై రావాలని ఈడీకి సుప్రీం ధర్మాసనం సూచించింది. మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో మార్చి 21న అరెస్టు అయిన ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌.. ప్రస్తుతం తీహాడ్‌ జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో బెయిల్‌ కోసం ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందన తెలియజేయాలని ఏప్రిల్‌ 15న ఈడీకి నోటీసులు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *