తెలంగాణలో డబుల్‌ ఆర్‌ ట్యాక్స్‌ : మోడీ

నరేంద్ర మోడీ బ్రతికున్నంత వరకు రాజ్యాంగం రద్దు కాదు
జహీరాబాద్‌, ఏప్రిల్‌ 30 అక్షరదీక్ష:
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జహీరాబాద్‌లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ట్రిపుల్‌ ఆర్‌ లాంటి సూపర్‌ హిట్‌ సినిమా ఇస్తే.. తెలంగాణకు కాంగ్రెస్‌ డబుల్‌ ఆర్‌ ట్యాక్‌ ఇచ్చిందని ఎద్దేవా చేశారు.డబుల్‌ ఆర్‌ ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. తెలంగాణలో కాంగ్రెస్‌ డబుల్‌ ఆర్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తోంది. వ్యాపారవేత్తలు డబుల్‌ ఆర్‌ ట్యాక్స్‌ కట్టాల్సి వస్తోంది. డబుల్‌ ట్యాక్సుతో ప్రజలు విసిగిపోయారు. డబుల్‌ ఆర్‌ ట్యాక్సు సొమ్ము ఢల్లీికి వెళుతోంది. డబుల్‌ ఆర్‌ ట్యాక్సుకు షాక్‌ ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో మరింత పతనమవుతుంది. ఈ డబుల్‌ ఆర్‌ ట్యాక్సుపై విస్తృత చర్చ నడుస్తోందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒకే గూటి పక్షులని మోడీ విమర్శించారు. ప్రజలు భవిష్యత్‌ కోసం దాచిన సొమ్మును దోచేసే కుట్ర చేస్తోందని కాంగ్రెస్‌ పార్టీపై మండిపడ్డారు. కంద్రంలో కాంగ్రెస్‌ వస్తే ప్రజల సొమ్ముకు రక్షణ ఉండదని అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిస్తే వారసత్వ పన్ను విధించబోతోందన్నారు. ప్రజల ఆస్తుల్లో 50 శాతం లూటీ చేసేందుకు కాంగ్రెస్‌ కుట్ర చేస్తోందన్నారు ప్రధాని మోడీ. అవినీతి రాకెట్‌లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు భాగస్వాములని ప్రధాని మోడీ దుయ్యబట్టారు. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుతో భారీ కుంభకోణానికి పాల్పడిరదన్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌ రెడ్డి పాత్ర ఉన్నప్పటికీ బీఆర్‌ఎస్‌ తొక్కిపెట్టిందని.. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ కాళేశ్వరం స్కాంను తొక్కిపెడుతోందని విమర్శించారు. ఢల్లీి లిక్కర్‌ కేసులో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అవినీతి దోస్తీ బయటపడిరదని విమర్శించారు.కాంగ్రెస్‌ పార్టీకి రాజ్యాంగం అంటే ఎప్పుడూ గౌరవం లేదని మండిపడ్డారు ప్రధాని మోడీ. మొదటి రోజు నుంచీ రాజ్యాంగం, అంబేద్కర్‌ను కాంగ్రెస్‌ అవమానించిందని ధ్వజమెత్తారు. మొదట రాజ్యాంగంలో రామాయణ, మహాభారత చిత్రాలు ఉండేవని.. వాటిని కాంగ్రెస్‌ తొలగించిందని గుర్తు చేశారు. అధికార దాహంతో నెహ్రూ, ఇందిర రాజ్యాంగాన్ని పదే పదే అవమానించారని మండిపడ్డారు. ఎమర్జెన్సీని విధించి ప్రజల హక్కులను కాలరాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని పేద ప్రజల కోసం కాంగ్రెస్‌ ఎప్పుడూ పనిచేయలేదన్నారు. లంబాడి సమాజానికి కాంగ్రెస్‌ తీవ్ర అన్యాయం చేసిందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను ముస్లింలకు కట్టబెట్టాలని కుట్ర చేస్తోందని మోడీ అన్నారు. నరేంద్ర మోడీ బ్రతికున్నంత వరకు రాజ్యాంగం రద్దు కాదని, రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత తనదేనని ప్రధాని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించిన రిజర్వేషన్లను కాపాడతామని అన్నారు. ముస్లింలకు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చే ప్రయత్నాన్ని అడ్డుకుంటానని స్పష్టం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *