కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధం

హైదరాబాద్‌, మే 1 అక్షరదీక్ష:
బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఎన్నికల ప్రచారంపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఎన్నికల ప్రచారంలో అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సీరియస్‌ అయ్యింది. ఈ క్రమంలోనే కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంపై 48 గంటలపాటు నిషేధం విధించింది ఎన్నికల సంఘం.ఇటీవల సిరిసిల్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు అందడంతో పరిశీలించిన అనంతరం ఎన్నికల సంఘం ఈ మేరకు చర్యలు తీసుకుంది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 48 గంటలపాటు ఈ నిషేధం అమలులో ఉండనుంది.కాంగ్రెస్‌?నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని నిరంజన్‌?రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈసీ నిషేధం విధించింది. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసీఆర్‌?పై చర్యలకు ఈసీ చర్యలు తీసుకుంది.ఈసీ నిషేధం స్పందించిన కేసీఆర్‌ ఎన్నికల సంఘం నిషేధం విధించడంపై కేసీఆర్‌ స్పందించారు. నా మాటలను అధికారులు సరిగా అర్థం చేసుకోలేదు. స్థానిక మాండలికాన్ని అధికారులు అర్థం చేసుకోలేదు. కాంగ్రెస్‌ నేతలు కొన్ని వ్యాఖ్యలను ఎంపిక చేసుకొని ఫిర్యాదు చేశారు. నా వ్యాఖ్యలకు ఇంగ్లీష్‌ అనువాదం సరికాదు. కాంగ్రెస్‌ విధానాలు, హామీల అమల్లో వైఫల్యాన్నే ప్రస్తావించాను అని కేసీఆర్‌ స్పష్టం చేశారు.కాగా, బుధవారం రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించినట్లు ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్‌ 5వ తేదీన సిరిసిల్లలో కాంగ్రెస్‌ నేతలపై కేసీఆర్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్‌ నేత నిరంజన్‌ రెడ్డి ఫిర్యాదు మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *